- Advertisement -
తమిళ స్టార్ సూర్య వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు సూర్య. ఇప్పటికే సూర్య కోసం బలమైన కథ రాశాడాని వార్తలు వస్తుండగా సినిమాపై అప్పుడే అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో సూర్య డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నారని.. సూర్య రెండు పాత్రల్లో ఒక పాత్ర నెగిటివ్, మరో పాత్ర పాజిటివ్ అని రూమర్స్ వినిపిస్తున్నాయి.
సూర్య సరసన భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోండగా తాజాగా కాయదు లోహర్ ను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Also Read:ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం
- Advertisement -

