- Advertisement -
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు. జూన్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తుండగా సినిమాలోని మరో పాటకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది.
తారా తారా – ది సిజ్లింగ్ సింగిల్ అనే లిరికల్ ట్రాక్ రిలీజ్ టైమ్ ను టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల మే 28న ఉదయం 10:20 గంటలకు ఈ పూర్తి పాట విడుదల కానుంది.
జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు మరియు నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ దయాకర్ రావు నిర్మిస్తున్నారు.
Also Read:ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం
- Advertisement -

