- Advertisement -
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, కేరళలో కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు నమోదుఅయ్యాయి. అత్యధికంగా కేరళలో 273 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.
తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56, ఢిల్లీలో 23, కర్నాటకలో 36 యాక్టివ్ కేసులు ఉండగా మహారాష్ట్ర థానేలో కొవిడ్ తో 21 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. బెంగుళూరులో 84 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు.
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ కొవిడ్ పై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్, మందులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు.
Also Read:కాంగ్రెస్ మొద్దు నిద్ర వీడాలి: హరీష్
- Advertisement -

