- Advertisement -
రాజకీయంగా బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబంతో నాకు ఎలాంటి విభేదాలు లేవు అన్నారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. మీడియాతో మాట్లాడుతూ మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తాను కానీ కాంగ్రెస్ పార్టీలోకి మాత్రం వెళ్లను అని తేల్చిచెప్పారు.
కేసీఆర్ దేవుడు.. ఆయనకు పాదాభివందనాలని కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజే చెప్పాను అన్నారు. అయితే తనను వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తిని పార్టీలో తీసుకునేటప్పుడు చెప్పలేదనే బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చాను అన్నారు.
నేను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉన్నాను… కాంగ్రెస్ పార్టీ నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదు.. నేనెప్పుడూ కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉన్నాను అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆ పార్టీలో చేరాను… కాంగ్రెస్ 16 నెలల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అన్నారు కోనేరు కోనప్ప.
Also Read:కాంగ్రెస్ మొద్దు నిద్ర వీడాలి: హరీష్
- Advertisement -

