Rahul:రాహుల్ పై నాన్‌ బెయిలబుల్ వారెంట్

8
- Advertisement -

ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి షాక్ తగిలింది. జార్ఖండ్‌లోని చైబాసా ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2018 నాటి పరువు నష్టం దావా కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

2018 మార్చి 28న కాంగ్రెస్ సమావేశంలో రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీపై చేసిన ప్రసంగానికి సంబంధించి, బీజేపీ నేత ప్రతాప్ కుమార్ 2018 జూలై 9న ఛాయిబాసా CJM కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు.

ఈ కేసును 2020 ఫిబ్రవరి 20న జార్ఖండ్ హైకోర్టు ఆదేశాలతో CJM కోర్టు నుంచి రాంచీ స్పెషల్ ఎంపీ-ఎంఎల్ఏ కోర్టుకు బదిలీ చేశారు. అక్కడి నుంచి కేసును ఛాయిబాసా స్పెషల్ ఎంపీ-ఎంఎల్ఏ కోర్టుకు బదిలీ చేశారు. అనంతరం కోర్టు కేసును స్వీకరించింది. కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు పంపింది, కానీ ఆయన హాజరుకాలేదు.

Also Read:Monsoon: కేరళను తాకిన నైరుతి

- Advertisement -