- Advertisement -
ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన ప్రొఫెసర్ అలీఖాన్‌కు బెయిల్ లభించింది. హర్యానాలోని అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీఖాన్ మహ్ముదాబాద్‌కు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు.
ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అలీఖాన్. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయగా తనకు బెయిల్ మంజూరు చేసి విచారణ నిలిపివేయాలని ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు అలీఖాన్ .
దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు..పబ్లిసిటీ కోసం ఇలాంటి చర్యలు ఎందుకంటూ మందలించింది. తన క్లయింట్ పోస్టులో నేరపూరిత ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలు ఏమున్నాయని వాదించిన అలీఖాన్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు.
Also Read:Chiru 157:వింటేజ్ లుక్‌లో చిరు!
- Advertisement -

