మావోయిస్టు అగ్రనేత కేశవరావు మృతి

8
- Advertisement -

మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది ఛత్తీస్‌గఢ్‌. ఇవాళ ఉదయం జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 28మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం. మరికొందరికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది.

ఎన్ కౌంటర్ మృతుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. కేశవరావు పై కోటిన్నర రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. నంబాల కేశవరావు మావోయిస్టు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. 2018లో గణపతి రాజీనామాతో మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.

ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జయ్యన్నపేట. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో మావోయిస్టు పార్టీలో పని చేశారు. వరంగల్ ఆర్ఈసీ ఇంజనీరింగ్ చదివారు. ఆయన తండ్రి ఉపాధ్యా యుడు. కేశవరావు మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా కూడా పనిచేశారు.

- Advertisement -