వచ్చేది వైసీపీ ప్రభుత్వమే: జగన్

8
- Advertisement -

స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు అన్నారు మాజీ సీఎం జగన్. వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. సంఖ్యాబలం లేకపోయినా నర్సారావుపేట, కారంపూడిల్లో గెలిచామని ప్రకటించుకున్నారు అన్నారు.

ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ గుర్తుమీద, ఒక పార్టీ బి-ఫాం మీద గెలిచినప్పుడు, సంఖ్యాబలంలేకపోయినా సీఎం స్థానంలో ఉన్నవాళ్లు అక్రమాలను ప్రోత్సహించడం ఎంతవరకూ సమంజసం చెప్పాలన్నారు. ఏ ప్రభుత్వంపైన అయినా వ్యతిరేక రావాలంటే సమయం పడుతుంది…. ప్రతి కార్యకర్త కష్టాన్నీ చూస్తున్నాను అన్నారు.

జగన్‌ 2.Oలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుంది… కోవిడ్‌ కారణంగా ఐదేళ్లపాలనలో అనుకున్నంతమేర సరిగ్గా చేయలేకపోయాం. ఇవాళ మీ కష్టాలను చూస్తున్నాను అన్నారు. రేపు కచ్చితంగా వై​సీపీకి కార్యకర్తే నంబర్‌ ఒన్‌. అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి. కొడతానంటే.. కొట్టమనండి. కాని, మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి అన్నారు. కాని, ఆ అన్యాయాలు చేసిన వారికి సినిమాలు చూపిస్తాం…. రిటైర్డ్‌ అయిన వారినీ లాక్కుని వస్తాం. దేశం విడిచిపెట్టి వెళ్లినా సరే రప్పిస్తాం. అన్యాయాలు చేసిన ఒక్కొక్కరికి సినిమాలు చూపిస్తాం… మనకూ టైం వస్తుంది…. వచ్చేది మన ప్రభుత్వమే… మంచి రోజులు కచ్చితంగా వస్తాయి అన్నారు జగన్.

Also Read:ఓదెల 2…ఓటీటీలో సరికొత్త రికార్డు!

- Advertisement -