విశ్వక్‌ మూవీలో పుష్ప 2 నటుడు!

11
- Advertisement -

వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు నటుడు విశ్వక్ సేన్. తన నెక్ట్స్ ప్రాజెక్టు కల్ట్. థ్రిల్లర్‌ మూవీగా వస్తుండగా ఈ సినిమాలో గాయత్రి భారద్వాజ్ , యజ్ఞ తుర్లపాటి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది. పుష్ప 2 లో తన నటనతో ఆకట్టుకున్న తారక్ పొన్నప్ప ఈ సినిమాలో ప్రధాన విలన్‌గా కనిపించనున్నారు.

ఈ సినిమా షూటింగ్ వచ్చే సోమవారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుంది. తారక్ సినిమాస్ మరియు వన్మయే క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. సంగీతాన్ని రవీ బస్రూర్ అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

Also Read:ఆస్పత్రి నుండి విశాల్ డిశ్చార్జ్..

- Advertisement -