బాలీవుడ్ దర్శకుడు…సంచలన కామెంట్స్!

9
- Advertisement -

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ సంచలన కామెంట్స్ చేశారు. ఓ సమయంలో తన కూతురి పెళ్లి చేయడానికి డబ్బులు కూడా లేకపోతే నటుడు విజయ్ సేతుపతి సాయం చేశాడని తెలిపారు.

కెన్నడీ మూవీ సమయంలో విజయ్ సేతుపతిని తరుచూ కలుస్తూ ఉండేవాడిని.. ఈ సందర్భంగా ఓ అద్భుతమైన కథ ఉందని చెప్పాడు. తొలుత నేను, ఆ రోల్ చేయడానికి ఒప్పుకోలేదు. అయితే కెన్నడీ సినిమా విషయంలో విజయ్ సేతుపతి, నాకు సాయం చేశాడు. ఆ సాయానికి బదులుగా మహారాజా సినిమా చేసేందుకు అంగీకరించినట్లు తెలిపారు.

మహారాజా మూవీ ద్వారా వచ్చిన రెమ్యూనరేషన్‌తోనే నా కూతురి పెళ్లి చేశాను… ఆ మూవీ సక్సెస్ తర్వాత మళ్లీ సౌత్ నుంచి వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి అన్నాడు అనురాగ్ కశ్యప్..

ప్రస్తుతం అడివి శేషు హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ‘డెకాయిట్: ఏ లవ్ స్టోరీ’ మూవీలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు అనురాగ్.

Also Read:‘సార్పట్ట 2’ … క్రేజీ న్యూస్!

- Advertisement -