టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు విరాట్ కోహ్లీ. టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు కోహ్లీ . ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. టెస్ట్ క్రికెట్లో 14 సంవత్సరాలు పూర్తి అయ్యాయి… నిజంగా చెప్పాలంటే, ఈ ఫార్మాట్ నన్ను ఎలాంటి ప్రయాణంలోకి తీసుకెళ్తుందో నేను ఊహించలేదు. ఇది నన్ను పరీక్షించింది, తీర్చిదిద్దింది, జీవితాంతం నాకు తోడుండే పాఠాలను నేర్పింది అన్నారు విరాట్.
టెస్ట్ క్రికెట్…నిశ్శబ్దంగా జరిగే పోరాటం, పొడవైన రోజులు, ఎవరూ చూడని చిన్నచిన్న క్షణాలు – ఇవన్నీ మన లోపల చారిత్రాత్మకంగా నిలిచిపోతాయి అన్నారు. ఈ ఫార్మాట్ నుంచి నేడు తప్పుకుంటున్నానని… ఇదే సరైన సమయం అనిపిస్తోంది అన్నారు. నా తోటి సహచరులకు, ఈ ప్రయాణంలో నన్ను గుర్తించి ప్రేమించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అన్నారు. నా టెస్ట్ కెరీర్ను ఎప్పటికీ చిరునవ్వుతో గుర్తు చేసుకుంటాను అని చెప్పారు విరాట్.
View this post on Instagram
Also Read:కార్మికుల పక్షపాతి నాయిని: కేటీఆర్

