ప్రతి సంవత్సరం కోమటి చెరువులో తెప్పోత్సవం చేసుకుంటున్నాం… తెప్పోత్సవం అంటే ఎక్కడో విజయవాడలో లేదా ఇంకెక్కడో చూసేవాళ్లం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇప్పుడు కాళేశ్వరం నీళ్లతో కోమటి చెరువును నింపి, గోదావరి నీళ్లలో తెప్పోత్సవం చేసుకుంటున్నాం. ఈ సారి కూడా సిద్దిపేట కోమటి చెరువులో అద్భుతంగా తెప్పోత్సవం నిర్వహించుకుందాం అని అన్నారు.
పాకిస్తాన్‌లో ఉగ్రవాదులను ఏరి వేయడానికి భారత సైన్యం అద్భుతంగా పోరాటం చేస్తోంది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశంసించారు. పహల్గాంలో అమాయకులైన 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపడం కలిచివేసిందన్నారు.
ఈ హోమంలో పాల్గొన్న భక్తులందరికీ పేరుపేరునా నమస్కారం. దుర్గాప్రసాద్ స్వామీజీ చేతుల మీదుగా ఈ హోమం సిద్దిపేటలో జరగడం చాలా సంతోషంగా ఉంది. ఉగ్రవాదాన్ని అంతం చేయాలని, భారతదేశంలో శాంతి నెలకొలపాలని దుర్గాప్రసాద్ స్వామీజీ ఆశీస్సులతో చేసే ఈ హోమం ఫలించాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మన సైనికులకు బలాన్ని అందించి, ఉగ్రవాదులపై విజయం సాధించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. తెలంగాణలో ఈ భక్తి కార్యక్రమం మొట్టమొదటగా సిద్దిపేటలో ప్రారంభించడం జరిగిందని హరీశ్‌రావు పేర్కొన్నారు.
Also Read:జవాన్లకు మద్దతుగా నిలవాలి:ఓవైసీ

