జవాన్ మురళీ నాయక్‌కు వైసీపీ నివాళి

11
- Advertisement -

భారత్-పాకిస్తాన్ యుద్దంలో అమరుడైన మురళీనాయక్‌కు తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జీ, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ యుద్ధంలో ముర‌ళీ నాయ‌క్ చూపించిన తెగువ, ఆయ‌న త్యాగం దేశంలోని ప్ర‌తి పౌరునికీ స్ఫూర్తినిస్తుంద‌ని అన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ ఎళ్ళవేళ‌లా అండ‌గా ఉంటుంద‌న్నారు.

ఈనెల 13న వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం కల్లి తండాకు వెళ్లి ముర‌ళీ నాయ‌క్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శిస్తార‌ని వెల్లడించారు. ఇప్ప‌టికే ఫోన్ ద్వారా ముర‌ళీ నాయ‌క్ కుటుంబ స‌భ్యులను ప‌రామ‌ర్శించిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు.

Also Read:బీజేపీపై ప్రకాశ్ రాజ్ ఫైర్

- Advertisement -