ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా రామ్ నాథ్ కోవింద్ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీఏలో మొత్తం 47 పార్టీల ప్రాతినిధ్యం ఉంది. 18 సీట్లున్న శివసేన.. తర్వాత 16 ఎంపీ సీట్లతో తెలుగుదేశం సెకండ్ ప్లేస్ లో వుంది. రామ్ నాథ్ మొత్తం నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి సెట్ నామినేషన్లపై ప్రధాని మోడీ సంతకం చేయగా రెండో సెట్ పై చంద్రబాబు సంతకం చేశారు. మూడో సెట్ పై అమిత్‌షా, నాలుగో సెట్‌పై పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. తనకు మద్దతిచ్చిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు రామ్ నాథ్. రాష్ట్రపతి పదవికే వన్నే తెచ్చే విధంగా ప్రయత్నిస్తానని చెప్పారు.
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు కేంద్ర ప్రభుత్వం భారీ భద్రతను కల్పించింది. జడ్ ప్లస్‌తో కూడిన ఎన్ఎస్జీ భద్రతను ఆయన పొందనున్నారు.మరోవైపు రామ్‌నాథ్‌కు పోటీగా విపక్షాలు లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ను తమ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. మీరాకుమార్ జూన్ 28న నామినేషన్ వేయనున్నారు. జులై 17న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలను జులై 20న వెల్లడించనున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పదవీకాలం జులై 24తో ముగిసిపోనుంది.
1945, అక్టోబర్ 1న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించారు రామ్ నాథ్ కోవింద్ . అడ్వకేట్‌గా ఆయన కెరీర్‌ను మొదలుపెట్టారు. ఢిల్లీ హైకోర్టులో 1977 నుంచి 79 వరకు సెంట్రల్ గవర్నమెంట్ అడ్వకేట్‌గా ఉన్నారు. 1980 నుంచి 93 వరకు ఆయన సుప్రీంకోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. 1978లో ఆయన సుప్రీంకోర్టులో అడ్వకేట్-రికార్డ్‌గా పనిచేశారు. ఢిల్లీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో ఆయన 16 ఏళ్లు పనిచేశారు. ఢిల్లీ బార్ కౌన్సిల్లో 1971లో రామ్‌నాథ్ న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు.
1994లో యూపీ నుంచి రాజ్యసభకు ఎంపీగా ఎంపికయ్యారు. 2006 వరకు ఎంపీగా ఆయన రెండుసార్లు చేశారు. పార్లమెంట్‌కు చెందిన అనేక కమిటీల్లోనూ ఆయన సభ్యుడిగా ఉన్నారు. పార్లమెంట్‌కు చెందిన ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ, హోంశాఖ, పెట్రోల్ మరియు ఇంధనం, సామాజిక న్యాయం, లా అండ్ జస్టిస్, రాజ్యసభ హౌజ్ కమిటీల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. రామ్‌నాథ్ భార్య పేరు సవితా కోవింద్. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
#WATCH:Visuals of NDA's presidential candidate Ram Nath Kovind, PM Modi,Venkaiah Naidu,LK Advani,Amit Shah,Murli Manohar Joshi at Parliament pic.twitter.com/W7gMuNnTq3
— ANI (@ANI) June 23, 2017