పహల్గామ్‌కు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది. దాడిలో సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది.
ఆపరేషన్ సింధూర్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మేరా భారత్ మహాన్, జైహింద్ అంటూ అందరూ ట్వీట్ లు చేస్తున్నారు. పహల్గామ్‌దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి, ఎందరో మహిళల నుదుటి సిందూరం తుడిచేసిన కారణంగానే ఈ ఆపరేషన్‌కు సింధూర్ అని నామకరణం చేసినట్టు తెలుస్తుంది.
పలువురు సినీ ప్రముఖులు భారత సైన్యం జరిపిన ప్రతీకార దాడులపై స్పందించారు. “జై హింద్ కి సేన… భారత్ మాతా కి జై!!! #OperationSindoor అని నటుడు రితేష్ దేశ్‌ముఖ్ తెలపగా మధుర్ భండార్కర్ కూడా స్పందిస్తూ, “మన దళాల కోసం ప్రార్థనలు చేద్దాం. ఒకే దేశం, మనమంతా ఒక్కటిగా ముందుకు సాగుదాం. జై హింద్, వందేమాతరం అంటూ ఆయన రాసుకొచ్చారు.
మా ప్రార్ధనలన్నీ కూడా బలగాలతోనే ఉంటాయి. కలిసి ముందుకు సాగుదాం అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. భారత సైన్యం అధికారిక ఖాతాలో న్యాయం జరిగింది. జై హింద్ అనే ప్రకటనతో ఆపరేషన్ విజయాన్ని ధృవీకరించింది.
Also Read:ఆపరేషన్ సింధూర్‌పై ట్రంప్

