కశ్మీర్ అంశంపై ఐరాస భద్రతామండలిలో పాకిస్థాన్ ప్రయత్నం విఫలమైంంది. ప్రస్తుత పరిస్థితిని అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించేలా పాక్ ప్రయత్నం చేయగా విపలమైంది. ఐరాస భద్రతామండలి అంతరంగిక సమావేశంలో చర్చను కోరింది పాకిస్థాన్.
ఈ సమస్యను భారత్ తో ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని భద్రతామండలి సూచించింది. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించింది ఐరాస భద్రతామండలి. పాకిస్థాన్ కొన్ని కీలకమైన ప్రశ్నలు సంధించాయి భద్రతామండలి సభ్య దేశాలు.
పాకిస్థాన్ చెప్పిన పలు అంశాలను తిరస్కరించాయి సభ్య దేశాలు. లష్కర్ ఎ తోయిబా ప్రమేయంపై పాకిస్థాన్ ను ఆరా తీసింది ఐరాస. ప్రత్యేకంగా ఒక మతం పర్యాటకులను కాల్చిచంపడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్థాన్ జరుపుతున్న క్షిపణి పరీక్షలపై ఐరాస భద్రతామండలి ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతామండలి తాత్కాలిక సభ్యదేశంగా ఉంది పాకిస్థాన్.
Also Read:INTUC నేతలతో పొన్నం భేటీ

