ఆత్మాహుతి బాంబు ఇస్తే పాక్‌పై పోరాటానికి సిద్ధం అని కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ సంచలన కామెంట్స్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై తీవ్రంగా స్పందించారు కర్ణాటక మంత్రి బీజడ్ జమీర్ అహ్మద్.
తనకు ఆత్మాహుతి బాంబు ఇస్తే పాక్‌పై పోరాటానికి సిద్ధమని వ్యాఖ్యలు చేశారు. పాక్ ఎప్పటికీ భారత్‌కు శత్రు దేశమేనని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మేము భారతీయులం… మేము హిందూస్థానీలం, పాకిస్తాన్‌కు మాతో ఎప్పుడూ సంబంధం లేదు. వారు ఎప్పటికీ మన శత్రువులే. మోడీ , అమిత్ షా , కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే నేను స్వయంగా యుద్ధానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను అని కామెంట్ చేశారు.
నన్ను పాక్‌కు పంపించండి…మోడీ, షా నాకు ఆత్మాహుతి బాంబు ఇవ్వండి. నేను నా శరీరానికి కట్టుకొని పాక్‌కు వెళ్లి దాడి చేస్తాను అని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి అమాయకులపై దారుణమైన, మానవత్వహీన చర్య అన్నారు. ప్రతి భారతీయుడు ఐక్యంగా ఉండాలని, దేశ భద్రతపై కేంద్రం గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఉగ్రదాడికి నిరసనగా భారత్ …పాక్‌తో ఉన్న అనేక సంబంధాలను తగ్గించింది. ఇండస్ జల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇస్లామాబాద్ మిషన్ సిబ్బందిని తగ్గించింది. పాక్ విమానాలకు భారత గగనతలాన్ని మూసివేసింది. పాక్ సైనిక ప్రతినిధులను వెనక్కు పంపించింది.
Also Read:TTD:4న స్థానికులకు శ్రీవారి దర్శన టోకెన్ల జారీ

