ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని AICC ప్రధాన కార్యాలయంలో కీలకమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ అంశలాలపై చర్చించనున్నారు. అలాగే పార్టీ యొక్క భవిష్యత్తు వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది. కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
ప్రధానంగా 50% రిజర్వేషన్ గరిష్ఠ పరిమితిని ఎత్తివేయాలని, దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయనున్నారు. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా బలమైన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి కీలక సూచన చేయనున్నారు.
ఒక సంవత్సరం క్రితం ప్రధాని మోదీ… కుల గణన కోరేవారు అర్బన్ నక్సల్స్ అని అన్నారు జైరాం రమేష్.ఇప్పుడు కేంద్రం స్వయంగా కులగణణ ప్రకటించడం విడ్డూరమన్నారు. మోడీ కులగణనకు హెడ్లైన్ ఉంది, కానీ డెడ్‌లైన్ ఎక్కడ? అని ప్రశ్నించారు. కుల గణన ఫలితాలు ప్రభావవంతంగా ఉండాలంటే, 50% పరిమితిని తొలగించాల్సిందే ఇందుకు రాజ్యాంగ సవరణ అవసరం అని స్పష్టం చేశారు.
Also Read:అమరావతి పునర్నిర్మాణం…ప్రారంభ వివరాలు

