హైదరాబాద్‌లో అందాల పోటీలు నిర్వహించడంపై తనదైన శైలీలో మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తిరుపతిలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన నారాయణ.. హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్త్రీ జాతిని అవమాన పరుస్తూ అందాల పోటీలు నిర్వహించడం చూస్తుంటే ఆడవాళ్లను బజారులో పెట్టి అమ్మే పద్ధతిలో ఉందన్నారు
అందాల పోటీలు అంటే అర్థం ఏంది స్త్రీ జాతిని నడిరోడ్డులో పెట్టి వేలం వేయడమా? అది పద్ధతి కాదు బతకడం అంటే స్వయం శక్తితో బతకాలని.. దానికి అనుగుణంగా ప్రభుత్వాలు స్త్రీలకు స్వేచ్ఛను అందించాలని సూచించారు. అందాల పోటీలు నిర్వహించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుద్ధి లేదని గొప్పగా 25 కోట్లు ఖర్చు పెడుతున్నానని చెప్పడం అత్యంత పవిత్రమైన స్త్రీ జాతిని మరింత అవమానించడమేనన్నారు.
నా మేనకోడలు పావని కూడా అందాల పోటీలు పెడితే ఫస్ట్ వస్తుందని చలోక్తి విసిరారు. అలా కాకుండా ఇలా స్వయం శక్తితో బతకాలని బతకడానికి ముందుకు వచ్చిన తన మేనకోడలు పావనిని అభినందించారు.
Also Read:Nani:యుఎస్‌లో ‘హిట్ 3’జోరు!

