జాతీయ భద్రతా సలహా బోర్డు ఛైర్మన్‌గా అలోక్‌ జోషి

55
- Advertisement -

జాతీయ భద్రతా సలహా బోర్డును కేంద్రం పునర్‌వ్యవస్థీకరించింది. బోర్డు చైర్మన్‌గా రా (RAW) మాజీ చీఫ్‌ అలోక్‌ జోషీని నియమించింది. ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది.

ఈ బోర్డులో త్రివిధ దళాల మాజీ అధికారులు, ఇద్దరు మాజీ ఐపీఎస్‌లు, మాజీ ఐఎఫ్‌ఎస్‌ అధికారిని సభ్యులుగా చేర్చింది. మాజీ వెస్ట్రన్‌ ఎయిర్‌ కమాండర్‌ ఎయిర్‌ మార్షల్‌ పీఎం సిన్హా, మాజీ సదరన్‌ ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఏకే సింగ్‌, రియర్‌ అడ్మిరల్‌ మోంటీ ఖన్నా, మాజీ ఐఏఎస్‌లు రాజీవ్‌ సంజన్‌ వర్మ, మన్మోహన్‌ సింగ్‌, మాజీ ఐఎఫ్‌ఎస్‌ అధికారి బీ వెంకటేశ్‌ వర్మను ఈ కమిటీలో సభ్యులుగా నియమించింది.

పహల్‌గామ్‌ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటోంది కేంద్రం. ఇందులో భాగంగానే మోదీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read:తెలంగాణ బోనాల జాతర..వివరాలివే

- Advertisement -