అజార్ పేరును తొలగించవద్దు:హైకోర్టు

10
- Advertisement -

ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కి అజహరుద్దీన్ పేరు తొలగించవద్దు అని హెచ్‌సీఏకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోని నార్త్ స్టాండ్స్‌కు ఉన్న అజహరుద్దీన్ పేరు తొలగించాలని గత వారం హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశాలు జారీ చేసింది.

తన పేరును తొలగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన అజహరుద్దీన్, రెండు దశాబ్దాల పాటుగా క్రికెటర్‌గా భారత జట్టుకు సేవలందించానని, అంబుడ్స్‌మన్ ఆదేశాలపై స్టే ఇవ్వాలని ఆయన హైకోర్టును విజ్ఞప్తి చేశారు అజహరుద్దీన్.

అజహరుద్దీన్ పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టి, తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హెచ్‌సీఏను ఆదేశించింది హైకోర్టు.

Also Read:మీ క్లారిటీకి హ్యాట్సాఫ్!: కేటీఆర్

- Advertisement -