బాహుబలి..రీ రిలీజ్ డేట్ ఫిక్స్

10
- Advertisement -

ప్రభాస్ -రాజమౌళి కాంబోలో తెరకెక్కిన బిగ్గెస్ట పాన్ ఇండియా మూవీ చిత్రం బాహుబలి. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్రం భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పింది. బాహుబలి ది కంక్లూజన్ విడుదలై ఎనిమిదేళ్లు పూర్తైన నేపథ్యంలో రీ రిలీజ్​పై కీలక ప్రకటన చేశారు నిర్మాత శోభూ యార్లగడ్డ.

అక్టోబర్​లో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేకమైన రోజున ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి సంతోషంగా ఉన్నాను. బాహుబలి మూవీ భారత్​తో పాటు ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్​లో రీ రిలీజ్​ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఇంకా కొన్ని సర్​ప్రైజ్​లు కూడా ఉన్నాయి అని నిర్మాత శోభూ యార్లగడ్డ ట్వీట్ చేశారు.

ప్రభాస్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో ఎస్​ ఎస్​ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్​గా నిలిచింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది.

Also Read:అలా అయితే పాకిస్తాన్‌కే వెళ్లండి:పవన్

- Advertisement -