HIT3..వారికి మాత్రమే!

14
- Advertisement -

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన హిట్ 3 మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయగా నాని-శ్రీనిధి శెట్టి స్వయంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి A సర్టిఫికేట్ లభించింది.

ఇక ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనవిజయంగా ముగిసింది. ఈ వేడుకకు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, విశ్వక్ సేన్, ఆదివి శేష్ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా నాని, ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ భారీ బ్లాక్‌బస్టర్ అవుతుందని, ప్రేక్షకులకు గట్టి థియేట్రికల్ అనుభవాన్ని అందించబోతోందని హామీ ఇచ్చారు.

దర్శకుడు సైలేష్ కొలను ప్రేక్షకులకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఈ సినిమా హింసాత్మకంగా ఉంటుంది. అందువల్ల 18 సంవత్సరాల లోపు వారు చూడడానికి అనుకూలం కాదు. 18 సంవత్సరాల లోపు వారు దయచేసి హిట్ 3 చూసేందుకు రాకండి…సినిమా ప్రారంభం నుండే మేము హింసను చూపిస్తుందన్నారు.

Also Read:ఇరవై ఏళ్లు రాజకీయాల్లోనే ఉంటా:రేవంత్

- Advertisement -