గులాబీ కార్ల ర్యాలీ..ప్రారంభించిన హరీష్

13
- Advertisement -

పటాన్ చెరు నియోజకవర్గం నుండి చలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సిద్ధమైన గులాబీ రంగు కార్లను జెండా ఊపి ప్రారంభించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇప్పటికే ఎడ్లబండ్లతో నియోజకవర్గాలలో ర్యాలీగా రైతులు బయలు దేరగా తాజాగా అంబాసిడర్ కార్లను సిద్ధం చేస్తున్నారు.

100 గులాబీ అంబాసిడర్ కార్లతో భారీ ర్యాలీ బీఆర్ఎస్ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సందర్భంగా రవి యాదవ్ అనే యువనేత 100 అంబాసిడర్ కార్ లను సేకరించి, ఆ కార్లకు రిపేర్లు చేయించి, వాటన్నిటికీ గులాబీ రంగు వేయించి, కెసిఆర్ స్టిక్కర్లు అంటించి ర్యాలీగా వరంగల్ బహిరంగ సభకు వెళ్లాలని సిద్ధం చేశారు.

బీఆర్ఎస్ సింబల్ ప్రజల మనసులో నాటుకుపోయేలా కార్ల ర్యాలీ తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ సింబల్ అంబాసిడర్ కారు.

Also Read:పాక్‌ ప్రజలు వెళ్లిపోండి..డీజీపీ ఆదేశం

- Advertisement -