అవకాడో డెలివరీ..రూ.2.60 లక్షలు స్వాహా

9
- Advertisement -

అవకాడోలు డెలివరీ చేస్తామని రూ.2.60 లక్షలు దోచేశారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్ నగరానికి చెందిన 23 ఏళ్ల విద్యార్ధి, అవకాడోలు కొనడానికి ఆన్‌లైన్‌లో వెతుకుతుండగా, విజయవాడకు చెందిన బాలాజీ ట్రేడర్స్ అనే సంస్థ మేము హోమ్ డెలివరీ చేస్తామంటూ విద్యార్థిని సంప్రదించారు.

మరుసటి రోజు ఫోన్ చేసి డెలివరీ వాహనం మీ ఇంటికి 10 కిలోమీటర్ల దూరంలో ఉందని, ఆ వాహనం చెడిపోయిందనని డబ్బులు ఇస్తే మీ ఇంటికి వచ్చాక తిరిగి చెల్లిస్తామని చెప్పారు. మరొకసారి పోలీసులు వాహనాన్ని అడ్డుకున్నారని ఇంకొంత డబ్బు ఇవ్వమని కోరగా, ఆ విద్యార్థి వారికి రూ.2.60 లక్షలు చెల్లించాడు.

ఎంతసేపటికీ డెలివరీ బాయ్ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో సైబర్ మోసానికి గురయ్యానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు.

Also Read:ఇంటర్ ఫెయిల్.. సివిల్స్‌లో సత్తా

- Advertisement -