BSS 11: బెల్లంకొండ ఫస్ట్ లుక్ అప్పుడే!

12
- Advertisement -

టాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రస్తుతం బెల్లంకొండ నటిస్తున్న భైరవం సినిమా పూర్తి కావడానికి వస్తుండగా అలాగే టైసన్ నాయుడు సైతం షూటింగ్ చివరి దశలో ఉంది.

ఈ రెండు సినిమాలు లైన్‌లో ఉండగానే తన కెరీర్‌లో 11వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బెల్లంకొండ. దర్శకుడు కౌశిక్ పగళ్ళపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంతో అనుపమ పరమేశ్వరన్ మరోసారి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో నటిస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ డేట్‌ని ఫిక్స్ చేశారు మేకర్స్. ఏప్రిల్ 27న ఫస్ట్ ఫస్ట్ లుక్ విడుదల కానున్నట్లు తెలిపారు. ఈ చిత్రం కోసం ఇద్దరు సంగీత దర్శకులు సామ్ సి ఎస్ అలాగే చైతన్ భరద్వాజ్ లు సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Also Read:ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారా..పాక్ క్రికెటర్ ఫైర్!

- Advertisement -