సింగరేణి ప్రైవేటీకరణ అడ్డుకుంది కేసీఆర్ అని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. పెద్దపల్లి బీ ఆర్ ఎస్ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత.. పెద్దపల్లి జిల్లా ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేసింది అన్నారు. బొగ్గు గనులకు కేంద్రం పెద్దపల్లి జిల్లా… ఉద్యమ సమయంలో సింగరేణి సమ్మె చేస్తే డిల్లీకి ఉద్యమ సెగ తగిలింది అన్నారు.
25 ఏండ్లుగా నిలబడ్డ ఏకైక పార్టీ బీ ఆర్ ఎస్ … ప్రతిఒక్కరితో బీ ఆర్ ఎస్ పార్టీ పెనవేసుకుంది అన్నారు. ఒకప్పుడు అవహేళన చేసిన వాళ్లకు రక్షగా గులాబీ జెండా ఉంది.. పదేళ్లలో తెలంగాణను దేశానికే నెంబర్ వన్ గా నిలిపించి గులాబీ జెండా అన్నారు. 25 ఏండ్ల చరిత్రను యావత్ తెలంగాణ గుర్తుచేసుకుంటుంది… ఏడాది పాటు బీ ఆర్ ఎస్ పార్టీ వేడుకలు చేస్తాం అన్నారు. రజతోత్సవ సభకు పెద్దపల్లి జిల్లా నుండి పెద్ద ఎత్తున తరలిరావాలి… తెలంగాణ అంటే ప్రేమ వున్న ప్రతి ఒక్కరు వరంగల్ సభకు రావాలి అన్నారు.
చరిత్రలో నిలిచిపోయేలా, తెలంగాణ కుంభమేళగా సభ జరగనుంది.. పెద్దపల్లి కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనించాలి అన్నారు. రైతుబంధు ఎగ్గొట్టి రైతుకు బరోసా లేకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం … వ్యవసాయం చేయాలంటే రైతులు భయపడే స్తితికి తెచ్చారు కాంగ్రెస్ పార్టీ .. రైతుల సమస్యల పై ఎందుకు మాట్లాడడం లేదని శ్రీధర్ బాబు ను ప్రశ్నిస్తున్న అన్నారు.
బీ ఆర్ ఎస్ హయంలో అకాల వర్షాలు పడితే క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపరిహారం ఇచ్చాం… కాంగ్రెస్ పార్టీ ఎందుకు రైతులను పట్టించుకోదు చెప్పాలన్నారు.గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలి… కేసీఆర్ జీఓ 55 తెస్తే, కాంగ్రెస్ 29 తెచ్చి యువకుల పొట్టకొడుతున్నారు అన్నారు. తెలంగాణ పోరాటమే స్థానికత కాని కాంగ్రెస్ మళ్ళీ నాన్ లోకల్ తెస్తుంది… జిల్లాకో పెట్రోల్ బంకు తో వచ్చే లాభమెమీ లేదు అన్నారు.
Also Read:విజయ్ ACE..రిలీజ్ డేట్!

