జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడి..

14
- Advertisement -

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడి కలకలం రేపింది. దక్షిణ కాశ్మీర్ పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ ఆరోగ్య శాఖ మంత్రి సకీనా మసూద్ ఇటూ మాట్లాడుతూ..పర్యాటకులు రావడం వల్ల మా ప్రజలకు ఆదాయం, ఉపాధి లభిస్తుంది. అలాంటి వారికి దాడులు జరగడం చాలా దురదృష్టకరం. ఇలాంటి దాడులు పర్యాటకులను భయపెట్టి తిరిగి రావడానికి అడ్డుపడతాయి అన్నారు.

భద్రతా బలగాలు ఆపరేషన్ కొనసాగుతుండటంతో గాయపడిన వారి సంఖ్య పెరిగే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. ఘటనా స్థలికి సహాయక సిబ్బంది చేరుకోగా, పరిస్థితిని అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read:వీడియో..సింహాలతో భీకర పోరు!

- Advertisement -