- Advertisement -
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, గాయకులు సందీప్, మానుకోట ప్రసాద్‌లు రూపొందించిన ప్రత్యేక పాటల సీడీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాటల డైరెక్టర్ పూర్ణచందర్, మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది బీఆర్ఎస్. ఈ సభలో కేసీఆర్ చెప్పే ప్రసంగం కోసం అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సభకు లక్షలాదిగా జనం తరలిరానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
Also Read:తెలంగాణలో తేలికపాటి వర్షాలు
- Advertisement -

