నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. రైల్వే శాఖలో 9970 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడులైంది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.
అత్యధికంగా సికింద్రాబాద్ రీజియన్ లో 1500 ఖాళీలు ఉండగా రాంచీ రీజియన్‌లో 1213 ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి లేదా ఇంటర్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా మెకానికల్ /ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్/ ఆటో మొబైల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఈ నాలుగు బ్రాంచీల్లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
2025 జులై 1వ తేదీ నాటికి 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.మొదటి స్టేజీ సీబీటీ 1, రెండో స్టేజీ సీబీటీ 2, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూట్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుండగా అప్లై చేయడానికి చివరి తేదీ మే11.
Also Read:కాంగ్రెస్‌లో మంత్రివర్గ కుంపటి!

