వైసీపీకి షాక్‌ల మీద షాక్..

16
- Advertisement -

వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె, విశాఖపట్నం 6వ వార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక వైసీపీకి రాజీనామా చేశారు. మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆమె రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. తన రాజీనామా లేఖను జగన్‌కు పంపారు లక్ష్మీ ప్రియాంక.

వ్యక్తిగత కారణాల వల్ల వైసీపీకి రాజీనామా చేస్తున్నానని లేఖలో ఆమె పేర్కొన్నారు. పార్టీలో తనను ఆదరించి, అవకాశాలు కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పారు.

Also Read:Tirumala:టీటీడీ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీలు

మరోవైపు విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అవిశ్వాస తీర్మానానికి క్యాంపుకు తరలించిన కార్పొరేటర్లను తిరిగి వైజాగ్‌కు తీసుకురాగా వైజాగ్ చేరుకున్న తర్వాత వైసీపీకి లక్ష్మీ ప్రియాంక రాజీనామా చేశారు.

- Advertisement -