ఒలింపిక్స్‌లో క్రికెట్..వేదిక ఇక్కడే!

12
- Advertisement -

క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరపడుతూ 2028లో లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను అనమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ వేదికలను ప్రకటించింది ఐసీసీ.

ద‌క్షిణ కాలిఫోర్నియాలో ఉన్న పొమోనా సిటీలో క్రికెట్ టోర్నీ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఐసీసీ తెలిపింది. సుమారు 128 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. మ‌హిళ‌లు, పురుష‌ల విభాగాల్లో ఆరేసి జ‌ట్లు పోటీప‌డ‌నున్నాయి.

Also Read:HCU భూముల వివాదం…సుప్రీం సీరియస్

ఒలింపిక్స్‌లో క్రికెట్ వేదిక‌ను ప్ర‌క‌టించ‌డాన్ని స్వాగ‌తిస్తున్న‌ట్లు ఐసీసీ చైర్మెన్ జే షా తెలిపారు. క్రికెట్ పాపుల‌ర్ క్రీడ అని, అయితే హ‌ద్దులు దాటి ఆ క్రీడ‌ను ఒలింపిక్స్‌లో పెట్ట‌డం .. మెగా ఈవెంట్‌కు వ‌న్నె తేనున్న‌ట్లు జే షా వెల్ల‌డించారు. 1900 సంవ‌త్స‌రంలో చివ‌రిసారి పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఆడాడు. ఆ త‌ర్వాత క్రికెట్‌కు బ్రేక్ ప‌డింది. క్రికెట్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వ‌హించ‌నున్నారు.

- Advertisement -