ప్రైవేట్ సెక్టార్లలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని రాహుల్ గాంధీ అహ్మదాబాద్ ఏఐసీసీ మీటింగ్ లో చెప్పిండు అన్నారు కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు.గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ లో అమలు చేయాలని కోరుతున్న అన్నారు. అన్ని రాష్ట్రాలలో కూడా ప్రయివేట్ సెక్టార్లలో కూడా రిజర్వేషన్ కల్పించాలి అని డిమాండ్ చేశారు.
పార్లమెంట్ లో బిల్లు పెట్టి రాహుల్ గాంధీ ఆలోచనను అమలు చేయా… అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పూలే విగ్రహాన్ని పెడతామని అనడం సంతోషంగా ఉంది అన్నారు. అదేవిధంగా ప్రగతి భవన్ కు కాంగ్రెస్ ప్రభుత్వం పూలే పేరు పెట్టింది.. యూపీఏ సర్కారు లో IIT, IIM లో రిజర్వేషన్ కల్పించింది అని తెలిపారు. దీని ద్వారా వేలాది మంది ఇంజినీర్లు,డాక్టర్లు అయిండ్రు అన్నారు.
Also Read:HCU భూములు..చీకటి కోణం ఏమిటి?:హరీష్
నేను ఒక్కడినే IIT, IIM లో యూపీఏ కల్పించిన రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న… పార్టీలో ఎవ్వరు మాట్లాడటం లేదు, అందరూ మాట్లాడాలి అన్నారు.నా పేరు చెప్పక పోయిన పర్వాలేదు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ గురించి చెప్పండి… జ్యోతిరావు పూలే 198 వ జన్మదినం జరిగింది అన్నారు. కేవలం మహారాష్ట్ర లోనే పూలే పుట్టిన రోజు జరిపేవారు… కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో పూలే జన్మదిన వేడుకలు జరుపుతున్నారు అన్నారు.

