భారత్‌కు జేడీ వాన్స్..

17
- Advertisement -

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ భారత్‌లో పర్యటించనున్నారు. సతీసమేతంగా ఏప్రిల్‌ 21 నుంచి మూడు రోజుల పాటు వాన్స్ భారత్‌లో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు తదితరులతో కానున్నారు.

ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యపరమైన అంశాలతో పాటు వివిధ రంగాలకు సంబంధించి చర్చలు జరగనున్నాయి. అమెరికా, భారత్‌ మధ్య కీలక ఒప్పందాలు కూడా కుదిరే అవకాశముంది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్‌ వాల్జ్‌ కూడా ఏప్రిల్‌ 21–24 తేదీల్లోనే భారత్‌లో పర్యటించనున్నారు.

Also Read:పర్యావరణ యోధుడు..వనజీవి రామయ్య

- Advertisement -