ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో గత పదేళ్లలో ఎన్నడూ లేనంత అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైనందుకు ఆనందంగా ఉందని తెలిపారు లోకేష్. మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత 70%, రెండో సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 83%గా నమోదైంది. ప్రభుత్వ, ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలలో ఉత్తీర్ణత శాతం పెరిగిందని తెలిపారు.
మొత్తం 10,17,102 మంది విద్యార్థులు ఫలితాలను రాశారు. ఫలితాలను resultsbie.ap.gov.in లేదా వాట్సాప్ నంబరు 95523 00009 ద్వారా తెలుసుకోవచ్చు. మార్చి 19న ఫస్టియర్ పరీక్షలు ముగియగా, మార్చి 20న సెకండియర్ పరీక్షలు ముగిశాయి.
వాట్సాప్ నంబరు 9552300009కు హాయ్ అని మెసేజ్ పెట్టడం ద్వారా సెలెక్ట్ సర్వీస్ అంటూ ఆప్షన్లు వస్తాయి. ఆ తర్వాత ఎడ్యుకేషన్ సర్వీస్ ఆప్షన్‌ను ఎంచుకుని ఇంటర్ ఫలితాలు 2025పై క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి.
Also Read:పర్యావరణ యోధుడు..వనజీవి రామయ్య

