- Advertisement -
సోషల్ మీడియా పోస్టులపై నటి త్రిష ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకురాగా ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు కొంతమంది నెటిజన్లు.
దీనిపై ఘాటుగా స్పందించారు నటి త్రిష. విషపూరితమైన వ్యక్తులారా, అసలు మీ జీవితం ఎలా ఉంటుంది మీ జీవితంలో బాగా నిద్రపోతారా? సోషల్ మీడియాలో కూర్చొని ఇతరుల గురించి అర్థంలేని విషయాలు పోస్ట్ చేయడం నిజంగా మీకు సంతోషంగా అనిపిస్తుందా చెప్పాలన్నారు.
ఇతరుల గురించి నీచమైన పోస్టులు పెట్టే మీతో పక్కనున్న వారికి చాలా ప్రమాదం. గుర్తుతెలియని ఈ పిరికిపందలను చూస్తుంటే బాధగా ఉంది. వీరిని దేవుడే రక్షించాలంటూ త్రిష రాసుకోచ్చింది.
Also Read:నయీం కేసులో ఈడీ దూకుడు..
- Advertisement -

