ఉత్తర తెలంగాణలో ఎండలు….దక్షిణ తెలంగాణలో వానలు

21
- Advertisement -

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో వానలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ, రేపు రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే వర్షాలు పడినప్పటికీ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని తెలిపింది.

రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంటే మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో 41 నుంచి 42 ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలపగా మరోవైపు దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది.

ఇవాళ కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. హైదరాబాద్ లోనూ వర్షాలు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ తెలిపింది.

Also Read:పెట్రో, గ్యాస్ ధరల పెంపుపై కేటీఆర్ లేఖ

- Advertisement -