ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా బలపడి నైరుతి, దానికి ఆనుకుని దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి స్థిరంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో పలు చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. విశాఖపట్టణంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో కోస్తాంధ్రకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏప్రిల్ 11వ తేదీన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, పిడుగులు, పడే అవకాశం ఉన్నందున ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని సూచించారు. ఏలూరులో ఐదు మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలో రెండు, గుంటూరులో తొమ్మిది, పల్నాడులో రెండు మండలాల్లో తీవ్ర వడగాలులు ఉంటాయని తెలిపింది.
Also Read:అట్లీతోనే బన్నీ…ఫిక్స్!

