కేంద్ర ప్రభుత్వం మరో ప్రభుత్వ పథకానికి మంగళం పాడింది. 2018లో స్టడీ ఇన్ ఇండియా పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా విదేశీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించాలని టార్గెట్ పెట్టుకున్నారు. అయితే తాజాగా ఈ పథకానికి కేంద్రం స్వస్తి చెప్పింది.
దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలలో ఉన్నత విద్యను అభ్యసించాలని అనుకునే విదేశీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2023-24లో కొత్తగా విద్యార్థులెవ్వరికీ స్కాలర్‌షిప్పులు ఇవ్వలేదు. 2022-23లో ప్రయోజనం పొందిన వారికి ఈ ఏడాది మార్చి వరకూ ఉపకార వేతనాలు అందాయి.
స్కాలర్‌షిప్పులకు ప్రాచుర్యం లభిస్తూ విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తున్న సమయంలో ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసిందని ఎడ్‌సిల్‌కు చెందిన మాజీ అధికారి ఒకరు చెప్పారు. ఇటీవల కాలంలో పాఠశాల విద్యార్థులకు ఉద్దేశించిన నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్, మైనారిటీ విద్యార్థులు పరిశోధనలు చేయడానికి ఉపకరించే మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్, నేషనల్ స్కీమ్ ఆఫ్ ఇన్‌సెంటివ్ టూ గరల్స్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్, కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన వంటి పథకాలకు కేంద్రం అడ్డుకట్ట వేసింది.
Also Read:గుజరాత్‌లో కాంగ్రెస్ మేథోమధనం

