సామాజిక సాధికారత కోసం కృషి చేద్దాం: రేవంత్

18
- Advertisement -

స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి నివాళులర్పించారు. వారి జయంతిని స్మరిస్తూ జరుపుకునే ‘సమానత్వ దినోత్సవం’ సందర్భంగా సామాజిక సాధికారత కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

సామాజిక న్యాయం, సమానత్వం కోసం అట్టడుగు వర్గాల తరపున అలుపెరగని పోరాటం చేసిన మహానీయుడు బాబు జగ్జీవన్ రామ్ అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నా ఘన నివాళి… వారి సేవలు సదా స్ఫూర్తిదాయకం అన్నారు.

Also Read:SSMB29:పాస్ పోర్ట్ వెనక్కి ఇచ్చేసిన మహేష్‌!

- Advertisement -