రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఏది?:ప్రవీణ్‌ కుమార్

16
- Advertisement -

ఇవాళ ఉదయం సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీస్ అధికారి తెలంగాణ భవన్ కు వచ్చారు …దిలీప్ కొణతం కు నోటీసులు ఇచ్చేందుకు వచ్చానని చెప్పారు..హెచ్ సీ యూ కేసుకు సంబంధించి పోస్టు పెడితే నిర్మల్ నుంచి పోలీసులు వచ్చారు అన్నారు బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆర్‌ఎస్పీ…క్రిశాంక్ మీద కూడా కేసులు పెట్టారు అన్నారు. బీ ఆర్ ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు యథేచ్ఛగా రేవంత్ రెడ్డి సూచనలతో పెడుతున్నారు ..అక్రమ కేసులను ఖండిస్తున్నాం అన్నారు.

మహిళలకు రాష్ట్రం లో రక్షణ లేకుండా పోయింది ..గత వారం రోజుల్లోనే నలుగురు మహిళల పై అత్యాచార ఘటనలు జరిగాయి …మేడ్చల్ ఎం ఎం టీ ఎస్ మహిళా భోగిలో ఉన్నప్పటికీ మహిళ పై అత్యాచారం జరిగింది ..సంగారెడ్డి కంది లో భర్తను కట్టేసి మహిళ పై అత్యాచారం జరిగింది ..నాగర్ కర్నూల్ లో ఓ గుడి దగ్గర మహిళ పై సామూహిక అత్యాచారం జరిగింది …మార్చి 31 న జర్మనీ మహిళ పై పహాడీ షరీఫ్ లో అత్యాచారం జరిగింది ..ఇన్ని అత్యాచారాలు జరగడం మామూలు విషయం కాదు
..హోం మంత్రి గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే ఉన్నారు…ఇంత మంది పోలీసులు ఉన్నా ఇన్ని అత్యాచారాలు జరగడం ఏమిటీ ? అని ప్రశ్నించారు.

ఘోరమైన ఘటనలు జరుగుతున్నా రేవంత్ రెడ్డి వాటిపై కనీసం సమీక్షలు పెట్టలేదు …మున్సిపల్ పాలన పై రివ్యూ లు పెడుతున్న సీఎం హోం శాఖ పై మాత్రం పెట్టడం లేదు ..కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వస్తున్న సీఎం శాంతి భద్రతల పై సమీక్ష పెట్టరా ?…బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధమైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ..కేసీఆర్ హయం లో మహిళల రక్షణకు 331 షీ టీమ్ లు ఏర్పాటు చేశారు ..11 లక్షల సీసీ కెమెరా లు పెట్టారు ..పోలీసు వ్యవస్థ ఆధునీకరణ కు 770 కోట్ల కేసీఆర్ వెచ్చించారు ..పోలీసులు డయల్ 100 కు ఫోన్ చేసినా ఇపుడు స్పందించడం లేదు ..పోలీసులు తమ ద్రుష్టి నంతా బీ ఆర్ ఎస్ నేతల పై కేసులు పెట్టడం పై ద్రుష్టి పెట్టారు ..రేవంత్ పాలన లో పోలీసులంటే ప్రజలకు క్రమంగా నమ్మకం పోతోంది …మహిళలకు రక్షణ కల్పించమంటే రేవంత్ రెడ్డి హెచ్ సీ యూ లో నాలుగు వందల ఎకరాలు ఆక్రమించేందుకు పోలీసులను పంపారు ..అక్కడ కూడా విద్యార్థినుల పై పోలీసులు లాఠీలు ప్రయోగించారు మహిళలమీద అత్యాచారాలు జరుగుతున్నా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టకపోవడం ఏమిటీ ? అని ప్రశ్నించారు.

Also Read:82 ఏళ్ల వయస్సులో జిమ్..వైరల్ వీడియో!

తెలంగాణ లో జైళ్ల సామర్ధ్యం ఏడు వేల మంది ..తెలంగాణ లో దాదాపు నాలుగు కోట్ల జనాభా ఉంది .బీ ఆర్ ఎస్ కు లక్షలాది మంది సైన్యం ఉంది ..రేవంత్ రెడ్డి ఎంత మంది మీద కేసులు పెట్టినా ప్రజల గొంతుక గా పనిచేస్తాం …కాంగ్రెస్ నేతలు రాజకీయంగా ఎదురు దాడి చేయడం కాదు .మేము లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.

- Advertisement -