- Advertisement -
వయస్సు నెంబర్ మాత్రమేనని అని నిరూపించింది ఓ బామ్మ. 82 ఏళ్ల వయస్సులో జిమ్ చేయడమే కాదు ఏకంగా వెయిల్ లిఫ్టింగ్ చేస్తూ ఔరా అనిపించింది. బామ్మ సాహసంపై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తుండగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వృద్ధ మహిళ నీలం రంగు చీర కట్టుకుని సుమారు 50 కిలోల బార్‌బెల్‌ని ఎత్తింది. మహిళ పేరు కితామల్, తమిళనాడు రాష్ట్రంలోని పోల్లాచ్చికి చెందినవారు. ఆమె 82 ఏళ్ల వయసులో వెయిట్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం గెలిచారు. ఈ వయసులోనూ ఆమె ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎంతో సులభంగా బార్బెల్ ఎత్తుతూ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
View this post on Instagram
- Advertisement -

