- Advertisement -
ఏపీ ఎమ్మెల్సీగా నాగబాబు ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ జనసేన అధినేత,డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తో భేటి అయ్యారు నాగబాబు.
విజయవాడలోని డిప్యూటీ సిఎం నివాసానికి వెళ్లిన నాగబాబు సోదరుడు పవన్ కు పుష్ప గుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబుకు జనసేనాని శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు వివిధ అంశాలపై చర్చించుకున్నారు..
అలాగే హైదరాబాద్ లోని తన అన్నయ్య చిరంజీవి నివాసానికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు నాగబాబు. ఈ సందర్బంగా నాగబాబుకు చిరంజీవి పూల మాల వేసి సత్కరించారు.
Also Read:పార్టీ ఫిరాయింపు..ముగిసిన వాదనలు
- Advertisement -

