బహుజనుల వీరుడు… సర్వాయి పాపన్న

10
- Advertisement -

బహుజనుల కోసం పోరాటం చేసిన వీరుడు సర్వాయి పాపన్న అనికొనియాడారు మంత్రి జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్ గాంధీభవన్ లో టీపీసీసీ కళ్లు గీత కార్మిక విభాగం చైర్మెన్ కేశం నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ ఆత్మబలిదాన్ వర్ధంతి కార్యక్రమం హాజరయ్యారు మంత్రి జూపల్లి కృష్ణ రావు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు జూపల్లి.

బహుజనుల కోసం పోరాటం చేసిన వీరుడు సర్వాయి పాపన్న … 3 వందలఏళ్ల క్రితం మొగలాయుల పాలనకు వ్యతిరేకంగా పోరాటం పోరాటం చేసి వీర మరణం పొందిన యోధుడు పాపన్న అన్నారు. మొగలాయుల పాలన పై తెరుగుబాటు కోసం బహుజనులను ఏకం చేసి 18 కోటలను జయించి వ్యక్తి అన్నారు.

అలాంటి యోధుడు మళ్లీ రేవంత్ రెడ్డి రూపంలో వచ్చాడు… బీసీలకు మేలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చారు అన్నారు. బీసీల రిజర్వేషన్ తో సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు అండగా ఉన్నారు.. పాపన్న ఆలోచనలతో బీసీలకు మంచి చేయాలని నవయుగ పాపన్న వారసుడిగా రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు అన్నారు.

Also Read:ఢిల్లీలో బీసీ సంఘాల మహాధర్నా..

- Advertisement -