ఐష్‌ – అభిషేక్..విడాకులపై మరింత క్లారిటీ!

19
- Advertisement -

కొద్దిరోజులుగా బాలీవుడ్ కపుల్ అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్యరాయ్ విడాకులపై పుకార్లు షికార్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై పలుమార్లు క్లారిటీ ఇచ్చిన పుకార్లు మాత్రం ఆగడం లేదు. అయితే తాజాగా వీరిద్దరూ తాము విడిపోవడం లేదని పరోక్షంగా బలమైన సంకేతాలు ఇచ్చారు.

తమ కుమార్తె ఆరాధ్యతో కలిసి ‘కజ్రా రే’ పాటకు వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేయగా ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటికైనా ఉహాగానాలకు తెరదించాలని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఐష్ – అభిషేక్‌తో సమానంగా ఆరాధ్య కూడా స్టెప్స్ వేస్తూ అందరినీ ఆకట్టుకుంది.

ఇటీవల పూణేలో జరిగిన ఓ ఫ్యామిలీ వేడుకకు హాజరయ్యారు అభిషేక్ – ఐష్. వధూవరులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఐష్‌ గ్రీన్ అనార్కలీలో అద్భుతంగా కనిపించగా, అభిషేక్ బచ్చన్ గులాబీ రంగు ఎంబ్రాయిడరీ చేసిన కుర్తాలో స్టైలిష్ లుక్‌లో మెరిశారు.

 

 

View this post on Instagram

 

A post shared by Aishwarya❤️ (@aishhxedits)

 

 

Also Read: HCU భూముల వేలంపై ఎమ్మెల్సీ కవిత

- Advertisement -