పాపన్న గౌడ్..భవిష్యత్ తరాలకు స్పూర్తి

21
- Advertisement -

పాప‌న్న గౌడ్‌ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు చాటేలా ప్రతి ఏటా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు అని గుర్తుచేశారు మాజీ మంత్రి హరీశ్ రావు.

బహుజన పోరాట యోధుడు, సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాటుపడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ఘన నివాళుల‌ర్పించారు.

పాలనలో సబ్బండ వర్గాలను భాగస్వామ్యం చేసి, వేలాది మంది దళిత, బహుజన బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్దింది బీఆర్ఎస్ ప్రభుత్వం. బహుజనుల సంక్షేమం కోసం అనేక విప్లవాత్మకమైన పథకాలు, కార్యక్రమాలు అమలు చేసి వారి అభ్యున్నతికి పాటు పడింది. పాపన్న గౌడ్ గొప్ప సేవలను స్మరించుకుంటూ, వారి స్ఫూర్తితో ముందుకు సాగుదాం అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Also Read:వీడియో.. అద్భుత క్యాచ్ పట్టిన గ్రౌండ్‌మ్యాన్!

- Advertisement -