మురళీ కిశోర్ అబ్బూరి దర్శకత్వంలో యువ హీరో అక్కినేని అఖిల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌ని అఖిల్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్‌లో ఒక్క హిట్ కూడా లేని హీరోగా మారారు అఖిల్. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు అఖిల్. ఈ నేపథ్యంలోనే అఖిల్ పుట్టినరోజు కానుకగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లుక్‌ని రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read:Gas Price:తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు
ఈ సినిమాతో పాటు యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో అనిల్ అనే కొత్త దర్శకుడితో కూడా ఓ సినిమా చేయనున్నారు అఖిల్. రీసెంట్‌గా మరో దర్శకుడు నందుకు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ ఏడాది వరుస సినిమాలతో అలరించేందుకు రెడీ అవుతున్నారు అఖిల్.

