జమ్మూ టూ శ్రీనగర్‌..వందే భారత్ రైలు

16
- Advertisement -

కశ్మీర్‌కు తొలి వందే భారత ట్రైన్‌ రానుంది. ఏప్రిల్ 19న జమ్మూ-కత్రా-శ్రీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. దీనిద్వారా 272 కిలోమీటర్ల పొడవైన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ ప్రాజెక్ట్ పూర్తయినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.

ఈ రైలు కత్రా-శ్రీనగర్ మధ్య నడవనుంది. కత్రా-బారాముల్లా మార్గంలో ట్రయల్ రన్ విజయవంతం అయింది. కత్రా మరియు కశ్మీర్ మధ్య రైలు సేవకు రైల్వే భద్రతా కమిషనర్ అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.

నరేంద్ర మోదీ ఏప్రిల్ 19న ఉధంపూర్‌కి రానున్నారని.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను సందర్శించి, దానిని ప్రారంభిస్తారు అని తెలిపారు జితేంద్ర సింగ్.అలాగే కత్రా నుండి వందే భారత్ రైలును ప్రారంభిస్తారు అని తెలిపారు.

కశ్మీర్‌కు రైలు కనెక్టివిటీ కల్పించే ప్రాజెక్ట్ 1997లో ప్రారంభమైంది. వాతావరణ అనుకూలతల కారణంగా అనేకసార్లు ఈ ప్రాజెక్ట్ వాయిదా పడింది. ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 38 సురంగాలు ఉన్నాయి. వీటి పొడవు 119 కిలోమీటర్లు. అందులో అతి పొడవైన సురంగం 12.75 కిలోమీటర్ల పొడవైన (T-49 సురంగం)గా ఉంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద రవాణా సురంగంగా గుర్తింపు పొందింది.ఈ రైలు మార్గంలో 927 వంతెనలు ఉన్నాయి, వీటి కలిపిన పొడవు 13 కిలోమీటర్లు.

Also Read:ఉగాది రాశి ఫలాలు… 2025

- Advertisement -