జయశంకర్ సార్.. స్మృతిలో

268
KCR pays tributes to Prof Jayashankar
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సైద్దాంతిక ప్రాతిపదికను ప్రతిపాదించడమే కాదు… ఆచరించి చూపించిన తెలంగాణ దార్శనికుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్. ఇవాళ ఆయన వర్దంతి సందర్బంగా తెలంగాణ యావత్ సార్‌కు ఘనంగా నివాళులు అర్పించింది. జయశంకర్ సార్ వర్దంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు జరిగిన మహోధ్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ ఆధ్యంతం స్పూర్తిగా నిలిచారన్నారు.మైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడే తెలంగాణ ప్రాంతానికి జరిగే అన్యాయంపై జయశంకర్ మాట్లాడిన విష‌యం గుర్తు చేశారు. జీవితాంతం తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం, వివక్షపై తెలంగాణ ప్ర‌జ‌ల‌ను జాగృతం చేశారన్నారు. జ‌య‌శంక‌ర్ సార్ ఉద్య‌మ స్పూర్తితోనే రాష్ట్రం అభివృద్ధి చేసుకుంటున్నామ‌ని తెలిపారు.

వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూర్ మండలం అక్కంపేట గ్రామంలో జన్మించిన జయశంకర్ సార్ జీవితం ఆద్యంతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే సాగింది. జయశంకర్ సార్ తుదిశ్వాస విడిచే వరకు తెలంగాణ కోసం పాటుపడ్డారు. ప్రాథమిక విద్యను అక్కంపేటలోనే పూర్తి చేసిన జయశంకర్ సార్… తన ఊరి చిన్ననాటి జ్ఞాపకాలను సందర్భోచితంగా తన స్నేహితుల వద్ద పదే పదే గుర్తు చేసుకునేవారు. చిన్ననాటి స్నేహితులతో ఎల్లప్పుడూ సంబంధాలు నెరుపుతూనే ఊరి బాగోగులపై వాకబు చేసేవారు. ఇలా.. సార్ ఏ స్థాయికి వెళ్లినా.. సమయం చిక్కినప్పుడల్లా తన సొంతూరికి వచ్చి తన వారిని కలిసి వెళ్లేవారు. అంతటి మహాన్నత వ్యక్తిని తెలంగాణ సమాజానికి అందించిన అక్కంపేట గ్రామం నిజంగా చరిత్ర పుటల్లో కొన్ని పేజీలను దక్కించుకుంది.

KCR pays tributes to Prof Jayashankar
ఢిల్లీ నుంచి గల్లీ దాకా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రజల్ని చైతన్య పరిచి రాజకీయ ప్రక్రియ ద్వారా రాష్ట్ర సాధన కోసం ముందుకు నడిపిన మహా వ్యక్తి జయశంకర్. గ్రామం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన సార్‌ను ప్రతిరోజూ స్థానికులు తలచుకుంటారు. ప్రస్తుతం అక్కంపేట మూల మలుపు వద్ద సార్‌ను తలచుకునేందుకై గ్రామస్తులంతా కలిసి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

- Advertisement -