మూడు రంగుల్లో రేషన్ కార్డులు!

14
- Advertisement -

తెలంగాణలో త్వరలో కొత్త రేషన్ కార్డులు రానున్న సంగతి తెలిసిందే. పాత, కొత్త వారికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. ఇక కొత్తగా రానున్న రేషన్ కార్డులు స్మార్ట్ కార్డుల రూపంలో ఉండనుండగా దీనిపై క్యూ ఆర్ కోడ్ కూడా ఉండనుంది.

రేషన్​కార్డులు ఇక నుంచి రెండు రకాలుగా ఉంటాయని మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి తెలిపారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి బీపీఎల్​ కార్డులు, దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నవారికి ఏపీఎల్​ కార్డులు ఇచ్చే ఆలోచన ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 2.8 కోట్ల మంది రేషన్​కార్డు లబ్ధిదారులుగా ఉన్నారని తెలిపారు. అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్​కార్డులు ఇస్తుందని స్పష్టం చేశారు.

కార్డుల తయారీ సంస్థ ఎంపిక కోసం టెండర్లు పిలిచామని, ఆ ప్రక్రియ నెలాఖరులోగా అయిపోతుందని మంత్రి వెల్లడించారు. గతంలో పింక్​కార్డులు ఉన్నవారికి గ్రీన్​కార్డులు ఇవ్వనున్నామని, తెల్లకార్డు ఉన్నవారికి ట్రైకలర్​ కార్డులు వస్తాయని చెప్పారు. అయితే ఇందుకు సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read:Holi:ఆనంద కేళి.. హోలీ

- Advertisement -